బెల్లంపల్లి, జూన్ 6, (జనంసాక్షి )పేదలకు ఇంటి పట్టాతో యాజమాన్య హక్కు వచ్చిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని 28, 34 వార్డులలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలు ఈనెలాఖరు వరకు మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీఆరెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు సరిత, శ్రీలక్ష్మి, నాయకులు అశోక్ గౌడ్, నూనేటి సత్యనారాయణ, రెవెల్లి విజయ్, దామెర కిరణ్, శ్యామ్, శ్రీధర్, మధు, రాజం, శ్రీనివాస్, గోలి శివ, సుందర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇంటి పట్టాతో యాజమాన్య హక్కు. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.




