బెల్లంపల్లి, మార్చి 1, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని 1, 14, 15 వ వార్డుల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విస్తృతంగా పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్న ఇంటి పట్టాల డిమాండ్ నోటీసుల పంపిణీ గురించి అర్హులకు అవగాహన కల్పించారు. వంద గజాల లోపు వారికీ ఉచితంగా పట్టాల పంపిణీ జరుగుతుందని, వంద గజాల పైన ఉన్నవారు నామమాత్రపు రుసుముతో పట్టాలు అందజేస్తామన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు సంగీత-బానేశ్, నారాయణ, రమేష్, కో ఆప్షన్ సభ్యుడు వెంకటేష్, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆరెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ, యువజన అధ్యక్షుడు సన్నీబాబు, జనరల్ సెక్రెటరీ శ్యామ్, ఎస్సి సెల్ ప్రెసిడెంట్ కిరణ్, బీఆరెస్ నాయకులు శివ, మధు, శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇంటి పట్టాల డిమాండ్ నోటిస్ పంపిణీపై అవగాహన




