హైదరాబాద్ సిటీ : ఇండియా, అబ్రాడ్‌లో సెంట్రల్ వర్సిటీ పూర్వవిద్యార్థుల అసోసియేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ పూర్వవిద్యార్థుల అసోసియేషన్ కార్యవర్గం గురువారం యూఓహెచ్‌లో తొలి సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది. వర్సిటీ విధివిధానాలు, లక్ష్యాలు, లోగో తదితర అంశాలపై చర్చించారు. హైదరాబాద్ యూనివర్సిటీలో 2000 సీట్ల స్థాయి ఆడిటోరియం నిర్మించాలని ప్రతిపాదించారు. అసోసియేషన్ చేసిన ప్రతిపాదనలను సంబధిత అధికారులకు పంపిస్తానని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆర్‌పీ.శర్మ వారికి తెలిపారు. ఈ సమావేశంలో పూర్వవిద్యార్థుల అసోసియేషన్ గౌరవాధ్యక్ష్యుడు మల్లు భట్టివిక్రమార్క, అధ్యక్ష్యుడు డాక్టర్ ద్వారకా తిరుమలరావు, కార్యదర్శి డాక్టర్ జయరాం చిగురుపాటి, కోశాధికారి ప్రొఫెసర్ బీవీ.వర్మ, కన్వీనర్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ ప్రకాష్‌బాబు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ బి.పద్మావతి, డాక్టర్ ఎస్.అరుల్‌మోజీ, డాక్టర్ మహదేవ్ కళ్యాంకర్, డాక్టర్ దామోదరరావు, కేకే రెడ్డి, కిషోర్‌దత్ అట్లూరి పాల్గొన్నారు.




