ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం…

జకార్తా:ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రావిన్స్లోని సినాబంగ్ అగ్నిపర్వతం బద్దలైంది. గురువారం సాయంత్రం నుండి సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తున బూడిద ఎగిసిపడుతోంది. శక్తివంతమైన వేడి బూడిద , గాలులు విస్తరిస్తున్నాయని ఇండోనేషియా అధికారులు శుక్రవారం వెల్లడించారు. దీంతో సమీపంలోని గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది.