జకార్తా: ఇండోనేషియాలో ఈ రోజు భూకంపం సంభవించినట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే కార్యాలయం తెలిపింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైన ఈ భూకంపం అంబస్ నగరానికి 140 కి.మీ దూరంలో సంభవించినట్లు తెలుస్తోంది. భూకంపం తాలూకు పరిణామాలపై సమాచారం వెలువడవలసి వుంది.




