–
సిఐటియు పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావుజనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండల స్థాయి ప్రజాసంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు హాజరై మాట్లాడుతూ..పేదలైన అర్హులకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. ఇండ్ల ఇండ్ల స్థలాలు సాధన కోసం ఈనెల 9 తేదీన హైదరాబాదులోని సుందరయ్య పార్క్ వద్ద జరిగే ధర్నాలు అర్హులైన పేదలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గోరెంకల సురేష్, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు బందెల రాజకుమార్, ఎరుకల సాగర్, నాయకులు బావు రవి, సమ్మయ్య, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.




