ఫొటో : ఎల్వోసీ అందజేస్తున్న ఎమ్మెల్యే.బెల్లంపల్లి, ఫిబ్రవరి 7, (జనంసాక్షి )
నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన శ్రీశ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు, చికిత్సకు డబ్బులు లేకపోవడం తో విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం రూ. 4 లక్షల ఎల్వోసీ మంజూరు చేశారు. సతీసమేతంగా ఆసుపత్రికి వెళ్లి, పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకు రావాలని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఈసందర్భంగా అన్నారు. ఆయన వెంట ఆయన సతీమణి జయతారా, బాధిత కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.




