Friday, 6 November 2026

ఇండ్ల స్థలాల కోసం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు

ఇండ్ల స్థలాల కోసం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు

తిరుమలగిరి (సాగర్) నవంబర్ 29 (జనంసాక్షి):
మండలంలోని వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులు మంగళవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు నోముల భగత్ కుమార్ ను కలిసి తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూములు ఇస్తానని గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తమకి మండల కేంద్రంలో ఇండ్ల స్థలాలు మంజూరు అయ్యేవిధంగా చూడాలని ఈ సందర్భంగా విలేకరులు ఎమ్మెల్యే ను
కోరారు. వినతిపత్రం అందించిన వారిలో నందిబిక్షం ,గురువయ్య, అబ్దుల్లా, రవిశంకర్ ,చత్రు నాయక్ తదితరులు ఉన్నారు.