Tuesday, 3 November 2026

ఇందిరాగాంధీ ఆశయాల స్ఫూర్తిని కొనసాగిస్తాము.

ఇందిరాగాంధీ ఆశయాల స్ఫూర్తిని కొనసాగిస్తాము.

బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సూర దేవరాజు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 31. (జనంసాక్షి). దేశం కోసం ప్రాణాలనుసైతం తృణప్రాయంగా అర్పించిన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఆశయాల స్ఫూర్తిని కొనసాగిస్తామని బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సూర దేవరాజు అన్నారు. సోమవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సూర దేవరాజు మాట్లాడుతూ. దేశ సమగ్రత కోసం, అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ అందించిన సేవలను కొనియాడారు. తన ప్రాణాలను సైతం దేశం కోసం దేశం కోసం తృణప్రాయంగా అర్పించారని అన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆమె అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తడగొండ బాలకృష్ణయ్య, మంగా కిరణ్, తడక వెంకటేశం, బాలమల్లు, నూనె శ్రీనివాస్, వంగ మల్లేశం, కోడం శ్రీనివాస్, రవి మల్లేశం గౌడ్, కత్తెర ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.