Thursday, 5 November 2026

ఇందిరాపార్క్‌ వద్ద తెలంగాణ వాదుల ఐక్య దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణపై 2009, డిసెంబర్‌ 9న కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ వాదులు ఐక్యంగా నిరసనలు చేపట్టారు. ఇవాళ తెలంగాణ వాదులు ఇందిరాపార్క్‌ వద్ద ఐక్యంగా దీక్షకు దిగారు. ఈనిరసన దీక్షలో తెలంగాణ జేఏసీ నాయకులు , టీఆర్‌ఎస్‌ నేతలు, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్‌రెడ్డి, బీజేపీ నేతలు, సీపీఐ నాయకులు, ఇంకా పలువురు తెలంగాణ వాదులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *