Thursday, 5 November 2026

వీసీగా తెలంగాణ వారినే నియమించాలి

హైదరాబాద్‌: వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సెలర్‌గా తెలంగాణ వారినే నియమించాలని డిమాండ్‌ చేస్తూ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇవాళ వారు వీసీ ఛాంబర్‌లో బైఠాయించి వీసీగా తెలంగాణ వారినే నియమించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలతో మార్మోగించారు.ఛాంబర్‌లో సుమారు అరవై మంది విద్యార్థులు తిష్టవేశారు. లోపలి నుంచి గడియ వేసుకుని ఆందోళన చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *