హైదరాబాద్,మార్చి26 (జనంసాక్షి) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం వాపు మాత్రమేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…టీఆర్‌ఎస్ పార్టీని ఒంటరిగా ఓడించలేకే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగులను రెచ్చగొట్టారన్నారు. ఆఖరికి నిరుద్యోగులు కూడా ప్రభుత్వ వాదనను అర్థంచేసుకోలేక పోయాయని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కావాలని చేసిన దుష్పచ్రారాన్ని పట్టభద్రుల నమ్మారని అన్నారు.




