యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసే “ఇంటింటా ఇన్నోవేటర్” కార్యక్రమం లో భాగంగా జిల్లాలోని అన్ని రంగాలలోని ప్రజలనుండి వాట్సప్ ద్వారా (ఆన్లైన్) లో 51 దరఖాస్తులు అందగా, అందులో ఫైనల్ రౌండునకు 28 నూతన ఆవిష్కరణలు ఎం పిక అయినట్లు, ఈ వినూత్న ఆవిష్కరణలలో అన్నీ అంశాలలో మెరుగైన 14 ఆవిష్కరణలను తుది జాబితాకు ఎంపిక చేయబడినట్లు తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ వారు ప్రకటించారని గౌరవ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలుపుతూ హర్షం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమాన్ని మొత్తం సమన్వయం చేసినందుకు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కె.నారయణ రెడ్డి ని ఈ సందర్భంగా అభినందించారు.ఎంపిక కాబడిన వారి ఇన్నోవేషన్ లను తేదీ 15.08.2022 న జిల్లాలో జరిగే స్వతంత్ర్య దినోత్సవ వేడుకలలో ప్రదర్శించి , ప్రశంసా పత్రం తో అభినందించనున్నట్లు తెలియజేసారు.




