వీణవంక మే 6 (జనం సాక్షి ) వీణవంక మండల కేంద్రానికి చెందిన 108 పైలెట్ గులాం రిజ్వాన్ గత మార్చి 13న గుండెపోటుతో మృతి చెందగా. గులాం రిజ్వాన్ కుటుంబానికి తోటి ఉద్యోగులు 108 ,102, మరియు పార్థివ వాహనం సిబ్బంది గులాం రిజ్వాన్ కుటుంబానికి శనివారం రోజున 60 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని అందించారు. వారు మాట్లాడుతూ మా తోటి మిత్రుడు గులాం రిజ్వాన్ చిన్న వయసులో మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని అతడు మృతి చెందాడు కానీ మా గుండెల్లో గూడు కట్టుకున్నాడు అని తోటి ఉద్యోగులు కన్నీటి పరంతమయ్యారు అనంతరం గులాం రిజ్వాన్ కుటుంబాన్ని భవిష్యత్తులో మేము తోడుగా అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా 108 సిబ్బంది 102 సిబ్బంది పార్థివ వాహనం సిబ్బంది పాల్గొన్నారు.




