ఇచ్చోడ మే 06 (జనంసాక్షి) ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర శనివారం కు 19వ రోజుకు చేరుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి విధులు నిరహిస్తున్న
ఐకెపి వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, నెలకు జీతం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా… చేపట్టిన నిరవధిక సమ్మె ఈరోజు 19వ రోజుకు చేరుకుంది ఇచ్చోడ మండల కేంద్రంలో… స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో.. ఇచ్చోడ మండల వి.ఓ.ఏ.ల
నిరవధిక సమ్మె చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐకెపి వివొయే లను సేర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఐడెంటి కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా ,ఉద్యోగ భద్రత హెచ్ఆర్ కల్పించాలని, నెలకు 26 వేల వేతనం చెల్లించాలని, వివోఏ లను సీసీలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇచ్చోడ లో చేపట్టిన నిరవధిక సమ్మె నేటికీ 19వ రోజుకు చేరుకుందని ప్రభుత్వం వెంటనే స్పందించి ఐకెపి వి. వో.ఏ.ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐకెపి వి వో ఏ లు.. బరుకుంట సుభాష్, శైలేందర్ రెడ్డి ,పి .మారుతి, పుల్లేడు భీముడు, ధర్మేందర్, అనిత తది తరులు పాల్గొన్నారు…




