Wednesday, 4 November 2026

ఇటీవల  పెరిగిన ధరల అ నుగుణంగా హమాలీ కార్మికుల కూలి రేట్లు పెంచాలి.

 

 

 

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 9( జనం సాక్షి) వీణవంక మండల అన్ని గ్రామాల పరిధిలోని గ్రామాల హమాలి పెద్ద మనుషులతో ఆదివారం రోజున బీరన్న దేవస్థానం ఆవరణలో జనరల్ బాడీ సమావేశం మర్రి రవి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మండల అన్ని గ్రామాల హమాలీ కార్మికుల కూలిరెట్ల సీడ్స్ అండ్ బజార్ ఐకెపి.ఒప్పందం రెండు సంవత్సరాల కాలపరిమితి ముగిసినందున వెంటనే నూతన కూలీ రేట్ల ఒప్పందం చేయాలని హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు పిల్లి రవి యాదవ్ డిమాండ్ చేశారు. ఐకెపి సెంటర్లో కనీస సౌకర్యాలైన మంచినీటి సదుపాయం టెంటు ,సౌకర్యం కార్మికులకు కల్పించాలని, ప్రతి అమాలి కార్మికుడికి మండల తాసిల్దార్  ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉండాలని అలాగే కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని హామాలి కార్మికులకు వర్తించే విధంగా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని,  కోరారు. ఈ కార్యక్రమంలో మండల హమలి యూనియన్ నాయకులు తడిగొప్పుల్ రాజయ్య, గుంపుల సంపత్, ఎం శంకర్, ఎం రవి, బండి ఐలయ్య, రాజమల్లు, రాజ్వీర్, రాజు, కొమరయ్య, రవి శ్రీనివాస్, రాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు.