నిర్మల్ బ్యూరో, ఏప్రిల్09,జనంసాక్షి,,, జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన కై ఐక్యంగా పోరాడి సాదించుకుందామని టియుడబ్ల్యూజే (ఐజేయూ)జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్ అన్నారు, ఆదివారం జిల్లా కేంద్రంలో ని ఆర్&బి విశ్రాంతి భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగులో ఉన్న అకృటేషన్ కార్డులను కలెక్టర్ చొరవ తీసుకుని వెంటనే అందజేయాలని,డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అందరికి ఇళ్ల స్థలాలు, అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దశల వారీగా డిమాండ్ల సాధనకు కృషి చేద్దామని అన్నారు. ఈసమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య, ఉపాధ్యక్షులు గుమ్ముల అశోక్, రాజశేఖర్, ప్రశాంత్,హన్మాండ్లు,తర్లపాడు శేఖర్,వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు




