ఇదో సిగ్గుమాలిన దీక్ష


` రాష్ట్రం ఏర్పడ్డాక 1లక్షా 33 వేల ఉద్యోగాలిచ్చాం
` కేంద్రం వల్ల రాష్ట్రానికి దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పాలి
` విూకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఢల్లీిలో జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షచేయాలి
` కేంద్రవైఫల్యాలపై ధ్వజమెత్తిన మంత్రి కేటీఆర్‌
` వాస్తవాలను జీర్ణించుకోలేకనే బూటకపు దీక్షఅని మండిపాటు
హైదరాబాద్‌,డిసెంబరు 26(జనంసాక్షి):భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేడు చేపట్టనున్న నిరుద్యోగ దీక్షపై మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. సంజయ్‌ది నిరుద్యోగ దీక్ష కాదని.. అవకాశవాద దీక్ష అని విమర్శించారు. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనలో తెరాస చిత్తశుద్ధిపై కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల్లో భాజపా వైఫల్యాలను ఎండగట్టారు. దేశ నిరుద్యోగ యువతకు భాజపా ఏం చేసిందో చెప్పాలన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 1లక్షా 33 వేల ఉద్యోగాలిచ్చామని,టీఎస్‌ ఐపాస్‌ విధానం ద్వారా రూ.2లక్షల 20వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి సుమారు 16లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పించామని మంత్రి లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌కు ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు, మెడికల్‌ డివైజెస్‌ పార్కు వంటి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చినా కేంద్రం నుంచి అదనంగా ఒక్క రూపాయీ సాయం అందలేదన్నారు.
లేఖలోని సారాంశం..
హావిూ ఇచ్చిన దాని కన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన మా ప్రభుత్వాన్ని కాదు, లక్షలాది ఉద్యోగాలను పెండిరగ్‌ లో పెట్టిన విూ కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నిలదీ యాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 9 లక్షల ఉద్యోగ ఖాళీలు, ప్రభుత్వ బ్యాంకులు, సాయుధ బలగాల్లోని 5 లక్షల ఖాళీలు మొత్తంగా 15లక్షల ఖాళీలను ఎందుకు ఇంకా భర్తీ చేయలేదో ప్రధానిని ప్రశ్నించాలి. ఈ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారో ముందు స్పష్టం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయక, ఉద్యోగాలను, సంపద సృష్టించలేని విూ చేతగానితనంతో ప్రయివేటు రంగంలోనూ చతికిల పడిన విూ రిపోర్ట్‌ కార్డుని ప్రజల ముందు ఉంచాలి అని కేటీఆర్‌ అడిగారు. మా ప్రభుత్వం భారీస్థాయి ఉద్యోగాల కల్పనకు హైదరాబాద్‌ ఫార్మాసిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, మెడికల్‌ డివైసెస్‌ పార్కు, మెగా మెగా పవర్‌ లూమ్‌ పార్క్‌, వీవింగ్‌ పార్క్‌ వంటి మరెన్నో పారిశ్రామిక పార్కులను చేపట్టినా, వాటిలో ఒక్కదానికీ అదనపు సహాయం తీసుకురాలేని చేతకాని పార్లమెంటు ప్రాతినిధ్యం విూది కాదా? తెలంగాణకు పెట్టుబడులు తరలి వస్తుంటే పారిశ్రామిక కారిడార్లు ఇవ్వాలని కోరినా కొర్రీలు వేసిన ప్రభుత్వం విూదే కాదా? హావిూ ఇచ్చిన ఐటీఐఆర్‌, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వంటి హావిూలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని, విూ చేతకానితనంపై ఇందిరాపార్కు సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలి. తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి కోసం ఇచ్చిన ఒక్కటంటే ఒక్క ప్రోత్సాహం ఏమైనా ఉంటే చెప్పాలి. లేకుంటే కొలువుల భక్షకులే దొంగ దీక్షలు చేస్తామంటే కొంగలు కూడా సిగ్గు పడుతాయి. రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగులపై కపట ప్రేమను గుమ్మరిస్తూ రాజకీయ నిరుద్యోగంతో దీక్షకు దిగుతున్న విూరు అత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకోండి. నిరుద్యోగులకు, రాష్ట్ర యువతకు ఏ సాయమూ చేయలేని విూ చేతగానితనానికి, నిస్సహాయతకు క్షమాపణ కోరండి. లేకపోతే ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే అని జనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు అని కేటీఆర్‌ తెలిపారు.
తెలంగాణ యువతకు హృదయపూర్వక విజ్ఞప్తి
చివరగా తెలంగాణ యువతకు ఈ సందర్భంగా ఒక హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను అని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ యువత అకాంక్షలను సంపూర్ణంగా అర్దం చేసుకున్న ప్రభుత్వం మాది. యువతకు ఉపాధి కల్పనలో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులోనూ ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో మరిన్ని ఉద్యోగాల కల్పనకు మా ప్రయత్నం యథావిధిగా కొనసాగుతుంది. ఈ విషయంలో రాజకీయ లబ్ధి కోసం చేసే అసత్య ప్రచార ప్రభావానికి లోనుకాకుండా విజ్ఞతతో అలోచించాలని కోరుతున్నాను అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
వాస్తవాలను జీర్ణించుకోలేకనే బూటకపు దీక్ష
వాస్తవాలు ఇలా ఉంటే వాటిని జీర్ణించుకోలేక బూటకపు దీక్షకు పూనుకున్న విూరు రాష్ట్ర యువతను రెచ్చగొట్టి, వారిని చదువు నుంచి, ఉద్యోగ ప్రయత్నాల నుంచి దృష్టిని పక్కదారి పట్టించి వారి జీవితాలను నాశనం చెయ్యడానికి పూనుకుంటున్న విూకు ఈ సందర్భంగా కొన్ని అంశాల్లో విూ వైఖరిని రాష్ట్ర యువత తరపున నిలదీస్తున్నాను. దమ్ముంటే నేను లేవనేత్తె ఈ అంశాలపైన స్పందించాలి అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.
దుర్మార్గపు సర్కారు విూది
కేంద్రంలో ఏడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న విూ పార్టీ ప్రభుత్వం వల్ల తెలంగాణ యువతకు అందిన పిసరంత సాయమేమైనా ఉందా? విూ కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పగలరా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎర్ర బస్సు నుంచి ఎయిర్‌ బస్‌ దాకా, ట్రాక్టర్‌ నుంచి హెలికాప్టర్‌ దాకా , యాప్స్‌ నుంచి యాపిల్‌ మ్యాప్స్‌ దాకా హైదరాబాదును ఇన్వెస్టర్ల డెస్టినేషన్‌ గా మలుస్తున్న ప్రభుత్వం మాది. హైదరాబాద్‌ నగరాన్ని పెట్టుబడుల స్వర్గంగా, ఉద్యోగ ఉపాధి దుర్గంగా నిలబెట్టింది మేమైతే, ఇక్కడి యువతకు ఉపాధి కోసం చేపట్టిన భారీ పారిశ్రామిక పార్కులకు, ఉద్యోగ ఉపాధి ప్రయత్నాలకు ఒక్కపైసా అదనపు సాయం చేయని దుర్మార్గపు సర్కారు విూది. కొలువుల కల్పవల్లిగా వర్ధిల్లుతున్న హైదరాబాదుకున్న అద్బుత అవకాశమైన ఐటిఐఅర్‌ ప్రాజెక్టును రద్దు చేసింది విూరు కాదా? లక్షలాది యువత ఐటీ జాబ్స్‌ గండి కొట్టి.. యువతరం నోట్లో మట్టికొట్టిమళ్లీ విూరే సిగ్గుఎగ్గూ లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా? విూ దీక్షలను, కపట ప్రేమను చూసి అవకాశావాదమే సిగ్గుతో పదేపదే ఆత్మహత్య చేసుకుంటుంది. తెలంగాణ యువత విూద మాకున్నది పేగు బంధం ప్రేమ. విూలాగా ఓట్ల డ్రామా కాదు. 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నూతన జోనల్‌ విధానాన్ని తీసుకొచ్చిన భూమిపుత్రుల ప్రభుత్వం మాదైతే కొత్త జోనల్‌ విధానాన్ని ఆమోదించకుండా నెలలకు నెలలు ముప్పుతిప్పలు పెట్టిన కుటిల నీతి, కపట కేంద్ర ప్రభుత్వం విూది! అని కేటీఆర్‌ దుయ్యబట్టారు.యువతను నమ్మించి నట్టేట ముంచిన ద్రోహ చరిత్ర విూది. కేంద్రంలోని విూ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగిత రేటు గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి చేర్చిన ఘనత విూది. విూ బీజేపీ పాలిత యూపీ, గుజరాత్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పిడికెడు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన లక్షల మంది నిరుద్యోగులపై లాఠీచార్జీ చేసిన దుర్మార్గం కనిపించని కళ్లులేని కబోదులు విూరు. సాఫీగా సాగుతున్న ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బ కొట్టిన విూ డీమానిటైజేషన్‌, జీఎస్టీ నిర్ణయాలతో కొత్త వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పగలరా? ప్రపంచమంతా కరోనా సంక్షోభ సమయంలో పరిశ్రమను, ఉద్యోగులను అదుకునేందుకు అర్ధిక ప్యాకేజీలిస్తే రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఒక్క రూపాయి సాయం చేయని భారతీయ జుమ్లా పార్టీ విూది కాదా..
బీజేపీది పాపపు పాలన..
సర్కారువారి పాట బెట్టి విూ ఘనమైన మోడీగారు.. ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావుశేరు లెక్కన తెగ నమ్ముతున్నది వాస్తవం కాదా? అని మంత్రి పేర్కొన్నారు. కొత్త ఉద్యోగాల నియామకాల మాట దేవుడెరుగు కానీ ఉన్న ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌/ సీఆర్‌ఎస్‌ ఇచ్చి ఉద్యోగాలను ఊడగొట్టిన పాపపు పాలన విూది కాదా.. ఇన్నాళ్లు ఉద్యోగావకాశాలిచ్చిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రయివేటు పరం చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డల రిజర్వ్‌ డ్‌ జాబ్స్‌ ఎగరగొట్టిన పాపం విూకు కాక ఇంకెవ్వరికి తగులుతుంది? ఒక ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీ మాదిరి పాలన చేస్తూ ఉన్న వాటిని అమ్ముకుంటున్న విూరెక్కడా.. ప్రైవేటీకరణ చేయాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తున్నా.. ఆర్టీసీ, విద్యుత్‌, సింగరేణి లాంటి సంస్థలను కాపాడుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ? ఇక్కడ ఒక సూటి ప్రశ్న ? తెలంగాణ యువత తరపున ప్రశ్నిస్తున్నాము. విూ కేంద్ర ప్రభుత్వం కానీ, విూరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విూరు కల్పించిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లపైన ఒక శ్వేపపత్రం విడుదల చేసే దమ్ముందా? విూ బిజెపి పార్టీ అధికారం వెలగబెడుతున్న ఏ రాష్ట్రంలో నైనా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చారా? అతి తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల వరుసలో నిలిచింది తెలంగాణ రాష్ట్రం కాదా.. బీజేపీ పాలిస్తున్న ఉత్తరాది రాష్ట్రాల్లో.. ఉపాధిలేక లక్షల మంది యువత బతుకుతెరువు కోసం తెలంగాణ కు వలస వస్తున్నది నిజం కాదా? ఇక్కడ పెరిగిన ఉపాది అవకాశాల నేపథ్యంలో తెలంగాణకు వస్తున్న రివర్స్‌ మైగ్రేషన్‌ నిజం కాదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

తాజావార్తలు