Wednesday, 4 November 2026

ఇద్దరిపై గొడ్డలితో ఉన్మాది దాడి

ఆదిలాబాద్ : తాండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఓ ఉన్మాది వీరంగం సృష్టిస్తున్నాడు. ఉన్మాది గొడ్డలి చేత పట్టుకుని అందరిని హడలెత్తిస్తున్నాడు. ఓ కారు డ్రైవర్ చేయి నరికివేశాడు. కారు డ్రైవర్ చేయి నరికి వేసి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చాడు. అక్కడ మరో ఇద్దరిపై గొడ్డలితో దాడి చేశారు. ఉన్మాది దాడిలో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గంట క్రితం నుంచి ఉన్మాది గొడ్డలితో హల్‌చల్ చేస్తున్నాడు. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *