హైదరాబాద్ : హైదరాబాద్ లో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నిజాంపేటలో ఇద్దరు బుకీలను అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి రూ. 6.85 లక్షల నగదు, కారు, 2 ల్యాప్ టాపులు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.




