గుంటూరు: మంగళగిరి మండలం నవులూరులో సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట బేతపూడి రైతులు ఆందోళనకు దిగారు. రాజధాని కోసం తీసుకున్న తమ అంగీకారపత్రాలు వెనక్కి ఇవ్వాలని రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. రైతుల డిమాండ్‌పై కుదరదని అధికారులు తేల్చిచెప్పారు. నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఏపీ రాజధాని భూసేకరణపై స్పందించిన అనంతరం రైతులు ఇలా ఆందోళన బాట పడుతున్నారు.




