Thursday, 5 November 2026

ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడంలోనూ అన్యాయమే

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం మెండిచేయి చూపించిందని టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు అన్నారు. వడగండ్ల వాన, అకాల వర్షాల కారణంగా ఆరేళ్లుగా నష్టపోతున్న తెలంగాణ రైతులపై సీమాంధ్ర ప్రభుత్వం విపక్ష చూపుతుందని ఆరోపించారు. తెలంగాణ రైతులను సర్కారు మోసం చేసిందని ధర్నాకు దిగిన శాసన సభ్యులకు కనీస గౌరవం ఇవ్వాలన్న సోయి కూడా సీఎంకు లేదని హరీష్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం డ్రామాలాడుతుందని హరీష్‌ మండిపడ్డారు. శాసనసభ సాక్షిగా తలంగాణ ఎమ్మెల్యేలను సీఎం కిరణ్‌ అవమానించిందని ఆయన ఆరోపించారు. నీలం తుఫానులో ఆంధ్రా ప్రాంతంతోపాటు తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలో కూడా రైతులు నష్టపోయినా కూడా ఆంధ్రాకు నిధులు విడుదల చేసి తెలంగాణ జిల్లాలకు విడుదల చేయలేదని ఇది వివక్షత కాదా అని ప్రశ్నించారు. దీనిపై ఆయా జిల్లాల మంత్రులు ఎందుకు స్పందించడం లేదని అడిగారు.ఇలా తెలంగాణపై వివక్ష చూపుతున్నారు కాబట్టే తెలంగాణ అడుగుతున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *