శ్రీశైలం, కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం పరిపాలన భవనంలో విద్యుదాఘాతంతో ఒప్పంద ఉద్యోగికి తీవ్రగాయాలయ్యాయి. సర్వర్ ఉద్యోగి మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రున్ని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.




