Wednesday, 4 November 2026

ఇప్పలపల్లిలో ఎక్సైజ్ అధికారుల దాడులు 350 లీటర్ల

ఇప్పలపల్లిలో ఎక్సైజ్ అధికారుల దాడులు 350 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం, పది లీటర్ల నాటు సారా స్వాధీనం, ఇద్దరిపై కేసు నమోదు, జనం సాక్షి పదర పదర మండల పరిధిలోని ఇప్పలపల్లి, గానుగపెంట, మారడుగు , మో ర్సు తాండ లలో మంగళవారం నాడు నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి 350 లీటర్ల బెల్లం ఊట ను ధ్వంసం చేసి పది లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై పై కేసు నమోదు కేసు నమోదు చేశారు, ఈ సందర్భంగా అచ్చంపేట ఎక్సైజ్ సీఐ పరమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ నాటు సారా తయారుచేసి అమ్ముతున్నారని సమాచారం తెలియడంతో మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమన్వయంతో ఇప్పలపల్లి, గానుగపెంట, మారడుగు, మో రూ సు తాండ లలో ఇండ్ల వద్ద, వ్యవసాయ పొలాల వద్ద దాడులు చేయగా బెల్లం ఊట, నాటు సారా స్వాధీనం చేసుకొని బెల్లం ఊట ను ధ్వంసం చేసి మంగీలాల్, చందును అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పరమేశ్వర్ గౌడ్ తెలిపారు, ఈ దాడుల్లో ఎక్సైజ్ సిఐలు కృష్ణయ్య, రఘునాథరెడ్డి, ఎస్సైలు రవి, సతీష్ కుమార్, బాలరాజు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.