Wednesday, 4 November 2026

షర్మిల పై దాడికి నిరసనగా సీఎం దిష్టి బొమ్మ దహనం.

షర్మిల పై దాడికి నిరసనగా సీఎం దిష్టి బొమ్మ దహనం.
బెల్లంపల్లి, నవంబర్ 29, (జనంసాక్షి )
వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల పై టీఆరెఎస్ నాయకుల దాడికి నిరసనగా మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ చౌరస్తాలో సీఎం కెసిఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా వైస్సార్ తెలంగాణ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ కో ఆర్డినేటర్ కాశీ సతీష్ మాట్లాడుతూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర లో భాగంగా 3500 కిలోమీటర్లు పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజక వర్గంలో నీ లంబాడీ తండా గ్రామం లో పాదాయాత్ర చేస్తుండగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి కు చెందిన గూండాలు తెరాస కార్యకర్తలు షర్మిల బస చేసే బస్సు నీ తగులబెట్టడాన్ని, వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలను తెరాస నాయకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ సీఎం కెసిఆర్ దిష్టి బొమ్మ ను దహనం చేయడం జరిగిందన్నారు. షర్మిల చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతుంటే తెరాస నాయకులు, ఎమ్మెల్యే లు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. వాళ్ళు చేస్తున్న అవినీతి నీ ప్రజలకు చెప్పటం తో, ప్రజలు వైఎస్సార్ తెలంగాణ పార్టీ నీ ఆదరించి ప్రజలు రానున్న రోజుల్లో షర్మిల అక్కను ముఖ్యమంత్రి నీ చేస్తారని ఆయన అన్నారు. ఎన్ని దాడులు చేసిన షర్మిల పాదయాత్ర ఆగదు అని అన్నారు, షర్మిల అక్క జోలికి వస్తె ఊరుకునేది లేదని ఆయన మండి పడ్డారు, ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా నాయకులు ముల్కల రాజేంద్ర ప్రసాద్, విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు ఒరం కవి రాజ్, పట్టణ ఉపాధ్యక్షులు లింగంపెళ్లి సురేష్, ప్రధాన కార్యదర్శి ఎండీ సర్వేర్, కాసిపేట మండల అధ్యక్షులు సంపత్, నాయకులు నరేష్, మహేష్, మహిళ నాయకురాలు రాజేశ్వరి, స్వరూప, తులసి, అనూష, సుకన్య తదితులు పాల్గొన్నారు.