నెలరోజుల వ్యవధిలో ఐదు మోటర్లు చోరీకి గురి..
శంకరపట్నం: జనం సాక్షి మార్చి 28
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం లోని కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇప్పల పల్లెలో మోటర్లు చోరీకి గురవుతున్నాయని, బాధిత రైతు చింతి రెడ్డి సుధాకర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా రైతు సుధాకర్ రెడ్డి మాట్లాడారు. కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇప్పల పల్లెలో మెయిన్ కెనాల కువిద్యుత్తు మోటర్లు పెట్టుకొని తమ వ్యవసాయాన్ని సాగు చేసుకుంటున్నామని, కెనాల్‌కు పెట్టుకున్న మోటార్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్తున్నారని, గ్రామంలో నెలరోజుల వ్యవధిలో సుమారు ఐదు మోటర్లు చోరీకి గురయ్యాయని, సోమవారము సాయంత్రము మోటార్ ను బంద్ చేసి వెళ్లిన సుధాకర్ రెడ్డి మంగళవారం ఉదయం కెనాల్‌కు వెళ్లి మోటర్ ను చూడగా గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు కేశవపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు, పోలీసులు స్పందించి,మోటార్ల దొంగలను పట్టుకుని రైతులకు తగిన న్యాయం చేయాలని కోరుచున్నారు.
ఇప్పల పల్లెలో మోటర్లు చోరీ..




