శంకరపట్నం: జనం సాక్షి మార్చి 28
కరీంనగర్ జిల్లా తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె స్వరూప జాతీయస్థాయి ఉగాది మగువ అవార్డుకు ఎంపికైంది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ, శంకర పట్నం మండలంలోని, కేశవ పట్నం గ్రామానికి చెందిన పల్లె స్వరూప తెలంగాణ ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, కొన్ని ఏళ్ల నుండి మహిళల హక్కుల సాధన కోసం, తన వంతు పోరాటం చేస్తుందని, స్వరూప సేవలను గుర్తించి, క్రాంతి జ్యోతి మహిళా సాధికారత స్వచ్ఛంద సేవ సంస్థ జాతీయ ఉగాది పురస్కరించుకొని , జాతీయస్థాయి ఉగాది మగువ అవార్డుకు స్వరూప ను ఎంపిక చేసి, పరకాల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా స్వరూపను శాలువాలతో ,పూలమాలలతో సన్మానం చేసి, అవార్డు ప్రధానం, చేశారు. స్వరూప మగువ అవార్డుకు ఎంపిక కావడంతో కేశవపట్నం గ్రామ మహిళలు, జిల్లా మహిళా లోకం హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో, క్రాంతి జ్యోతి మహిళా సాధికారత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్వరూపకు ఉగాది పురస్కారం..




