హైదరాబాద్, (జనంసాక్షి): నిన్నటి ఛలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా పలువురు తెలంగాణనేతలను, తెలంగాణవాదులను ప్రభుత్వం అరెస్టు చేయడంపై తెలంగాణనేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు విద్యుత్‌సౌధా వద్ద మహాధర్నా నిర్వహించాలని తెలంగాణ నేతలు నిర్ణయించారు. ఈ ధర్నాకు తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిలు హాజరుకానున్నారు.




