జనం సాక్షి/ కొల్చారంనర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అండతండాలతో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుందని బిజెపి నాయకులు ఆరోపించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడు గ్రామం లోని హల్దీ వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను బిజెపి నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో ఖనిజ సంపదను ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట అక్రమ ఇసుక రవాణా చేస్తూ హైదరాబాద్ ప్రాంతాలకు తరలించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని వారి ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేష్ గౌడ్, కొల్చారం మండల పార్టీ అధ్యక్షులు దయాకర్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ కౌడిపల్లి పార్టీ అధ్యక్షుడు రాకేష్ తదితరులు పాల్గొన్నారు




