జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లామంథని మండలం రచ్చపల్లి గ్రామానికి చెందిన సింగనవెణ లింగేష్ అనే రైతుకు చెందిన ఆరు (6) గేదెలు మంథని మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన గురుకుల కళాశాల ముందు ఇసుక లారీ ఢీకొనడంతో నాలుగు (4) గేదలు మృత్యువాత పడడం జరిగింది. 2 ప్రాణాలతో పోరాడుతున్నాయి అని, పాడి రైతు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులతో కాంగ్రెస్ కిసాన్ సెల్ పార్టీ, సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మంథనిలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని అన్నారు. ఇసుక లారీలు మద్యం మత్తులో, అధిక లోడు, మరియు అత్యంత వేగంగా వెళ్లడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. మంథని మండలంలో ఇసుక మాఫియాను అరికట్టడంలో సంబంధిత అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అన్నారు. వెంటనే మూగజీవుల చావుకు కారణమైన లారీని, ఆ డ్రైవర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, పాడి రైతు కోల్పోయిన ఆరు(6) గేదెలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్, సిపిఎం నాయకులు ఆర్ల సందీప్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముస్కల సురేందర్ రెడ్డి, నాయకులు కిరణ్ ,శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇసుక లారీ ఢీ కొట్టి చనిపోయిన గేదెలకు నష్టపరిహారం చెల్లించాలి




