Tuesday, 3 November 2026

జన నాయకుడైన కాంగ్రెస్ ఏఐసీ సభ్యులు డాక్టర్ నరేష్ జాదవ్ జన్మదిన వేడుకలు.

గుడిహత్నూర్ జూన్ 23( జనం సాక్షి)జనం మెచ్చిన జననాయకుడు ఏఐసీసీ సభ్యులు డాక్టర్ నరేష్ జాదవ్ జన్మదిన వేడుకల్ని శుక్రవారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగానిర్వహించారు.ముందుగా కేక్ కట్ చేసి మిఠాయిలు ఒకరినొకరు పంచుకున్నారు. బోథ్ నియోజకవర్గంలో ఆయన ప్రజల మధ్య అన్నివేళలా ఉండి సహాయ సహకారాలు అందిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న జననేతగా ఎదిగారని జననాయకుని కొనియాడారు.ఇలాంటి ఎన్నో జన్మదినాలు నిర్వహించాలని గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెల కరుణాకర్ అన్నారు.జన్మదిన వేడుకలో నాగనాథ్ అప్ప సురేష్ బాదవ్, యూసుఫ్ వసీం,రాజుపవర్, ప్రేమ్, రమేష్, కపిల్ తదితరులు ఉన్నారు.