ఇస్తెమాకు ప్రతి ఒక్కరూ తరలి రావాలి
మౌలానా అబ్దుల్ అలీమ్ ఫారూఖీ
బిచ్కుంద డిసెంబర్ 29 (జనంసాక్షి) నిజామాబాద్ లో తలపెట్టిన ఒక్క రోజు తహఫూజె ఖత్మే నబువత్ వర్క్ షాప్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 31 డిసెంబర్ బాద్ నమాజ్ అసర్ నుంచి జనవరి ఒక్కటివ తేదీ ఇషా నమాజ్ వరకు ఒక్కరోజు ప్రోగ్రాం ఉందని మౌలానా అబ్దుల్ అలీమ్ ఫారూఖీ పేర్కొన్నారు. ఇందులో మత పెద్దలు వస్తున్నారని, శాంతి సందేశం ఇస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండ హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా మద్నూర్, బిచ్కుంద, పిట్లం తదితర ప్రాంతాల్లో గోడ ప్రతులు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదీనా మస్జిద్ సదర్ అబ్దుల్ ముఖీద్, సయ్యద్ అసదుల్ల, డాక్టర్ నాసర్ ఖాన్, ఖాజా పాషా మరియు జునేద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఇస్తెమాకు ప్రతి ఒక్కరూ తరలి రావాలి




