మహబూబాబాద్ బ్యూరో-మే9 (జనంసాక్షి)మహబూబాబాద్ జిల్లాలో ఈఎంఆర్ఐ 102 అమ్మఒడి సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 11వ తేదీన ధరఖాస్తు లను ఆహ్వనించడం జరుగుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ శివకుమార్, జిల్లా ఎగ్జిక్యూటివ్ వద్ధీ హరీష్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరఖాస్తు చేసుకోవాలని అనుకునే అభ్యర్ధులు తమ ఓరిజినల్ సర్టిఫికెట్లు,ఒక జిరాక్స్ సెట్‌ను తీసుకురావాలని తెలిపారు.10వ తరగతి పాసై, 23 నుండి 35 సంవత్సరాలు కలిగిఉండాలన్నారు. ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి కనీసం మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలని తెలిపారు. ఇంటర్వ్యూ హనుమకొండ కలెక్టర్ కార్యాలయం నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు +91 9100799166, +91 9989458588 నంబరుకు సంప్రదించవచ్చని తెలిపారు.




