Wednesday, 4 November 2026

ఈఎస్ఐ  సేవలను వర్షిత ఆసుపత్రిలో కూడా వినియోగించుకోవచ్చు

 

 

 

 

 

 

ఎమ్మెల్యే భాస్కరరావు.మిర్యాలగూడ, జనం సాక్షి  కార్మిక శాఖ అనుబంధ వైద్య సేవలను స్థానిక వర్షిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో కూడా  ఉపయోగించుకోవచ్చని  మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు అన్నారు. బుధవారం వర్షిత ఆసుపత్రిలో ఈఎస్ఐ సేవల అనుమతి పత్రాన్ని ఆసుపత్రి చైర్మన్ కూటల రాంబాబు కు అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో గల ఈఎస్ఐ కార్డుదారులు కేవలం ఈ ఎస్ ఐ   డిస్పెన్సరీ ద్వారానే సేవలు పొందాలని, ఇకపై వైద్య పరీక్షలు వైద్య సేవలు  అన్ని కూడా  పొందవచ్చుని అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి చైర్మన్ కూటాల రాంబాబు మాట్లాడుతూ  ఈఎస్ఐ కార్డ్ కలిగిన రోగులకు తమ వర్షిత ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ గా, ఇన్పేషెంట్ గా పూర్తి ఉచిత సేవల్ని ఇకపై అందించనున్నామని , ఈ మేరకు తాజాగా ప్రభుత్వం నుండి అనుమతులు పొందామని, పరిశ్రమలు, కర్మగారాలు, మిల్లులు, పెట్రోల్ బంకులు, వాహన షో రూమ్‌లు, వాణిజ్య కేంద్రాలు తదితర రంగాలలో   కార్మికులుగా పని చేసే వారి కుటుంబ ఆరోగ్య భద్రతకు గానూ ప్రభుత్వం నిర్దేశించిన ఎంప్లాయిస్ స్టెట్ ఇన్సురెన్స్ కార్దు క్రింద అర్హులైన వారికి, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటూ ఆసుపత్రిలో ఇన్  పేషంట్ గా అడ్మిట్ చేసుకోని శస్త్ర చికిత్సలు, మందులు రూం  సౌకార్యాలు అన్నీ పూర్తి ఉచితంగా అందించనున్నామని ఆయన తెలియచేశారు. హాస్పిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అత్యాదునిక పరికారాలు, నిపుణులైన డాక్టర్ల బృందం రవాణ సౌకర్యం లాంటి ఎన్నో అంశాలని పరిగినలోకి తీసుకొని కేవలం అతికొద్ది హాస్పిటల్స్ లకు మాత్రమే ఈఎస్ఐ క్రింద వైద్యం చేసే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని అని అలాంటి అరుదైనా అవకాశం స్థాపించిన అనతి కాలంలోనే మా వర్షిత ఆసుపత్రికి రావడం చాల సంతోషకరమని ఆయన అన్నారు. ఈ సందర్బంగా వైద్య విభాగం ప్రభుత్వ జాయింట్ డైరెక్టర్ కి ఉద్యోగులు కార్మి కుల పక్షాన వారు కృతజ్ఞతలు తెలియజేసారు. ఉద్యోగులు, కార్డ్ క్రింద గైనాకలజీ , జనరల్ సర్జన్, హెర్నియా, గ్యాస్ట్రోలాంటి దాదాపు 58 రకలా వివిద వైద్య అవసరాల కోసం పూర్తి చికిత్స కోసం ఎల్లవేలలా తమ ఆసుపత్రి సందర్శించ వచ్చాని పూర్తి నగదు రహిత విదానంలో  ఉండె ఇట్టి సదవకాశమును అర్హులందరు వినయోగించుకోవల్సిందిగా ఆయన కోరారు.