Wednesday, 4 November 2026

వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం.

 

 

 

 

 

 

 

 

నెన్నెల, ఏప్రిల్ 26, (జనంసాక్షి )నెన్నెల మండల కేంద్రంలోని సత్యసాయి సేవా కేంద్రంలో నేటి నుంచి మే 5 వరకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సత్యసాయి సేవా సమితి సభ్యులు తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 8 నుంచి 10-45 వరకు తరగతులు నిర్వహించబడుతాయని వివరించారు. ఈ వేసవి శిబిరాల్లో యోగ, మెడిటేషన్, నాయకత్వ లక్షణాలు, తల్లిదండ్రుల విశిష్టత, సమయ పాలన అవశ్యకత, భారతదేశ విశిష్టత, క్రమశిక్షణ, దేశభక్తి, దైవభక్తి, నా జీవితమే నా సందేశం, క్విజ్ పోటీలు, వ్యాస రచన పోటీలు, జనరల్ నాలెడ్జి, కుటుంబం, సమాజం, జాతీయ సమైక్యత, ప్రకృతి పౌష్టికహారం, సహాయం, బాధ్యత, సేవా, దైవ ప్రీతి, పాపబీతి, సంఘ నీతి, మంచి పౌరుడు, మంచి కుటుంబం, మంచి సమాజం, అనే అంశాలపై అనుభవం గల అధ్యాపకుల చేత తరగతులు నిర్వహించబడుతాయని, విద్యార్థులు ఈ శిక్షణ తరగతులు వినియోగించు కునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. మరిన్ని వివరాలకు 9989571065 కు సంప్రదించాలాన్నారు.