జనం సాక్షి, మిర్యాలగూడ. ఈనెల పది నుంచి 20 తేది వరకు మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ మరియు మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం ఆధ్వర్యంలో జాతీయస్థాయి పద్య, సాంఘిక నాటికలు నిర్వహించబడునని మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపకాద్యక్షులు తడకమల్ల రామచంద్రరావు, అధ్యక్షులు బోయినపల్లి భుజంగరావు, ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి, సభ్యులు మామిడాల ఉపేందర్, రామావతారం, పుల్లాభట్ల వెంకట లక్ష్మీనారాయణ శర్మలు తెలిపారు. సోమవారం సబ్ జైల్ రోడ్ లో గల శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పద్య, సాంఘిక నాటక పోటీలను ప్రజలందరూ ఆదరించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. ప్రజలు వారి విలువైన సమయాన్ని సాయంకాల వేళలో ఈ నాటక పోటీలు జరిగే ప్రాంతానికి విచ్చేసి నాటక కళాకారులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నాటక పోటీలను జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి ,ఎమ్మెల్సీలు ప ల్ల రాజేశ్వర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ నగర్ భార్గవ్, ఆగ్రోస్ చైర్మన్ విజయ్ సింహ రెడ్డి, జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత ముడుంబై రామానుజాచార్యులు,తెలంగాణ రాష్ట్ర నాటక సమైక్య అధ్యక్షుడు గుంటి పిచ్చయ్య తదితరులు పాల్గొని ప్రారంభిస్తారని వివరించారు. మొదటిరోజు కొండ అనే సాంఘిక నాటకం ,రెండవ రోజు పక్కింటి మొగుడు సాంఘిక నాటకం, మూడవరోజు మహామంత్రి తిమ్మరసు పద్య నాటకం, 4రోజు నర్తనశాల పద్య నాటకం, ఐదవ రోజు పల్నాటి యుద్ధం పద్య నాటకం ఆరో రోజు పెట్రోల్ మాక్స్ పంచాయతీ సాంఘిక నాటకం, ఏడవ రోజు వసంత రాజకీయం పద్య నాటకం, 8వ రోజు చీకటి పువ్వు సాంఘిక నాటకం, 9వ రోజు జై శ్రీ కళ్యాణ శ్రీ కృష్ణ పద్య నాటకం, పదవరోజు సింహగర్జన పద్య నాటకం, 11వ రోజు విజయానిరుద్దం పద్య నాటకం తో ముగింపు సభ బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుందని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈనెల 10 నుండి 20 తేది వరకు జాతీయ స్థాయి పద్య, సాంఘిక నాటక పోటీలు




