జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ మార్చి 6: మండల పరిధిలోని జటప్రోలు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు 9వ వార్డ్ మెంబర్ ఎండి అబుబక్కర్ ను పెంట్లవెల్లి కాంగ్రెస్ మైనార్టీ సెల్ మండల్ అధ్యక్షుడిగా నాగర్ కర్నూల్ జిల్లా మైనార్టీ కార్యాలయంలో సోమవారం, టిపిసిసి రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు సోహెల్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన్, డిసిసి మైనార్టీ ప్రెసిడెంట్ హబీబ్, కొల్లాపూర్ అధ్యక్షులు బాలపిరు లు ,ఏకగ్రీవంగా ఎన్నుకోనీ వారి చేతుల మీదగా వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎండి అబుబక్కర్, మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నా పైన నమ్మకంతో ఈ పెంట్లవెల్లి మండల బాధ్యతలను అప్పగించినందుకు,కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పని చేస్తానని ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం , కెసిఆర్ మైనార్టీల కోసం 12 శాతం రిజర్వేషన్లు చేస్తానని మాట తప్పిండని రానున్న రోజుల్లో మైనార్టీ ప్రజలే టిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీ సభ్యులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తుందని, పేద ప్రజల పక్షాన వారి సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం వారికి మద్దతుగా ఉంటుందని, ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు ఖాదర్ భాషా, డిసిసి మైనార్టీ ప్రధాన కార్యదర్శి యూనిస్ మైనార్టీ యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.




