హైదరాబాద్, (మార్చి 20): ఈనెల 26 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వరకూ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,52,692 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతారు. వీరి కోసం 2,979 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టడానికి 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. విద్యార్ధులు పరీక్ష హాల్లోకి సెల్‌పోన్, కేలిక్యులేటర్లు తీసుకు రావడాన్ని నిషేధించామని బోర్డు తన ప్రకటనలో తెలిపింది.




