Wednesday, 4 November 2026

ఈనెల 27న టేకులపల్లిలో గద్దర్ సంస్మరణ సభ

 

టేకులపల్లి, ఆగస్టు 25( జనం సాక్షి ): ప్రజాయుద్ధనౌక గద్దర్ సంస్మరణ సభను ఈనెల 27న టేకులపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా నాయకులు ఎట్టి ప్రశాంత్ తెలిపారు. తెలంగాణ ప్రజాప్రంట్ వ్యవస్థాపకులుగా, ప్రజా వాగ్గేయకారుడిగా, సాంస్కృతిక విప్లవంతో ముందుండి ప్రజలను చైతన్యం చేయడంలో, తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో యువతను మేల్కోల్పడంతో గద్దర్ పోషించిన పాత్ర కీల కమైందని అన్నారు. టేకులపల్లిలో జరిగే సంస్కరణ సభకు కవులు, కళాకారులు, రచయితలు, మేదవులు హజ రుకానున్నరని తెలిపారు. మండల ప్రజలు, గద్దర్ అభిమానులు నిర్వహించే సంస్మరణ సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు