Wednesday, 4 November 2026

భువనగిరి లో నూతన బేకరీ ప్రారంభించిన మతపెద్ద మౌలానా అక్బర్ సహాబ్

భువనగిరి టౌన్ జనం సాక్షి:-
భువనగిరి పట్టణంలో కోర్ట్ ఎదురుగా ఎండీ మజహర్ కు చెందిన నూతన బేకరీ ని ముస్లిం మత పెద్ద మౌలానా సయ్యద్ అక్బర్ సహాబ్ ప్రారంభించారు.అనంతరం మౌలానా మాట్లాడుతూ యువత స్వశక్తి తో ఎదగాలని వ్యాపారం లో మంచి పేరు సంపాదించాలని తెలిపారు .బేకరీ ఓనర్ మజహార్ మాట్లాడుతూ ప్రజలకు అన్ని విధాల బేకరీ ఐటమ్స్ హైదరాబాద్ కు దీటుగా తక్కువ ధరలకే అందించడం తమ లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమం లో టీపిసిసి డిలీగేట్ మెంబెర్ తంగెల్లపల్లి రవి కుమార్,వై ఎస్ ఆర్ టీపీ జిల్లా అధ్యక్షులు ఎండీ అతహర్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అవేస్ చిస్తి,కౌన్సిలర్ సలాఉద్దీన్,జమీల్,అబిద్ అలీ, చిక్కుల వెంకటేష్, దర్గాయి హరిప్రసాద్,రాశిద్, సాజీద్,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.