పెన్ పహాడ్, ఏప్రిల్ 26 (జనం సాక్షి) : హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఈనెల 29న చలో హైదరాబాద్ లేబర్ కమిషన్ ఆఫీసు ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రణపంగ కృష్ణ పిలుపునిచ్చారు మంగళవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధర్నాకు సంబంధించిన డోర్ పోస్టర్లు విడుదల చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమాలీలందరికీ భవన నిర్మాణ కార్మికుల వల్లే వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలి .50 కిలోల మించిన బరువును నిషేధించాలి పని. గంటలు. పని భద్రత .గుర్తింపు కార్డులు. కనీస వేతనాలు .పిఎఫ్ .ఈఎస్ఐ. పింఛన్. వంటి చట్టబద్ధత హక్కులను కల్పించాలని ఐకెపి హామాలీలకు ప్రభుత్వమే బిల్లులు చెల్లించాలి ప్రమాద బీమా. ఆరోగ్య భీమా. సౌకర్యాలు కల్పించాలి. అమాలి కార్మికులందరికీ . ఇండ్ల. స్థలాలు ఇచ్చి డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని తదితర సమస్యలపై పరిష్కారం కోసం ఏప్రిల్ 29న చలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా కు హాల్ హమాలీలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పని ప్రదేశంలో హమాలీలకు టాయిలెట్స్ విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ కార్మికుల వర్గం పోరాడు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మార్చి నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తెచ్చింది ఈ కోడ్స్ అమలు అయితే కార్మిక హక్కులన్ని హరించి పోతాయి సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు యజమాన్యులతో బె రసారాలు అడిగే హక్కు ఎనిమిది గంటల. పని. దినం విధానం. కనీస వేతనాలు .పీఎఫ్ .ఈఎస్ఐ. హక్కులను ఎలాంటి సౌకర్యాలు లేకుండా యజమానులకు కట్టబెట్టి బానిసలుగా మార్చే చర్యలకు మోడీ ప్రభుత్వం పూనుకుంటుంది అసంఘటిత రంగం కార్మికులకు 2008లో తీసుకువచ్చిన సామాజిక భద్రత చట్టం అడకెక్కింది గ్రామాల్లో పని లేక రోజుకు 100 రోజుల పని కల్పిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని 25% నిధులు తగ్గించారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటి నిత్యవసర వస్తువులు ధరలు పెంచి సామాన్యుల పైన భారాలను మోపుతున్నారు మతోన్మాద విధానాలు అవలంబిస్తున్నారు కలిసి ఉన్న పేదల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నది తక్షణమే హక్కులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హమాలి మేస్త్రీలు .జగపతి శంకరు. ఒగ్గు శీను. వెంకన్న. మంగే హనుమంతు .లింగ. పాండు. తదితరు పాల్గొన్నారు




