Tuesday, 3 November 2026

బీదల రాష్ట్ర పార్టీ బిఆర్ఎస్, బలిసినోల్ల జనతా పార్టీ బిజెపి ! టిఆర్ఎస్ యువనేత కల్వకుంట్ల సంజయ్

 

 

 

 

 

మెట్పల్లి టౌన్, ఏప్రిల్ 25,జనంసాక్షి :బీదల కోసం ఏర్పాటుచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని బలిసినోల్ల జనతా పార్టీ బిజెపి అని బిఆర్ఎస్ యువ నేత డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు మంగళవారం పల్లి పట్టణంలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కూడా బి ఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు బిజెపి మోట భాయ్ అమిత్ షా మొన్న చేవెళ్ల మీటింగ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతికు పాల్పడుతున్నాడని అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు రాష్ట్రంలో నేరుగా ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు రైతుబంధు సహాయం కళ్యాణ్ లక్ష్మీ షాది ముబారక్ తదితర పథకాలలో ఎలాంటి అవినీతి ఆస్కారం లేకుండా నేరుగా వారి ఖాతాలలో జమ అవుతున్నాయన్నారు ఇలాంటి పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాలలో అమలు చేసి చూపాలని బిజెపి నాయకులపై ధ్వజమెత్తారు మొన్న టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ లో నిరుద్యోగులు కొంత నిరాశకు గురయ్యారని మన కోరుట్ల నియోజకవర్గంలో నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు కోరుట్ల నియోజకవర్గంలో ఎలాంటి సాయం కోసమైనా కష్టం వచ్చినా నేను ముందుంటానని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు నాయకులకు సూచించారు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ముందుంటన్నారు కాగా డాక్టర్ సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో యువకులు అభిమానులు కేరింతలు కొడుతూ ఆయన పై పూల వర్షం కురిపించారు