Thursday, 5 November 2026

ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు వారి ఆధ్వర్యంలో

ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు వారి ఆధ్వర్యంలో రాయపర్తి మండలం మహబూబ్నగర్ గ్రామంలో పెరటి కోళ్ల పెంపకం పై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో డాక్టర్ రాజన్న కె వి కె ప్రధాన శాస్త్రవేత్త మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని మహిళలు మరియు పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ పురుషకాహార లోపం ముఖ్యంగా మాంసకృతులు తక్కువ తీసుకోవడం వలన కలుగుతుంది.దీనిని నివారించడానికి పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం రాజశ్రీ కోళ్లను అభివృద్ధి చేయడం జరిగింది. రాజశ్రీ కోళ్లు ముదురు రంగులో ఉండి అధిక రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. రాజశ్రీ కోళ్లు మాంసం కొరకు మరియు గుడ్ల కొరకు కూడా పెంచుకోవచ్చును. ఇవి ఐదు నెలలకి గుడ్లను పెట్టడం జరుగుతుంది.గుడ్లు పెట్టడం మొదలుపెట్టిన తర్వాత సంవత్సరంలో 160 నుంచి 170 గుడ్లు పెడుతుంది అదేవిధంగా 20 వారాలు వచ్చిన తర్వాత పుంజు సుమారుగా రెండు నుంచి రెండున్నర కిలోల బరువు పెరుగుతుంది. అదేవిధంగా పెట్టెలు సుమారుగా కిలోన్నర బరువు పెరుగుతాయి. రాజశ్రీ కోళ్లు ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండడం వలన వీటిలో రోగాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి ఈ కోళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పెంచుకోవడానికి అనుకూలమైనటువంటివి. డాక్టర్ సాయి కిరణ్ వెటర్నరీ శాస్త్రవేత్త మాట్లాడుతూ రాజశ్రీ కోళ్లలో ముఖ్యంగా కొక్కెర తెగులు వస్తుంది ఈ తెగులు కొక్కెర తెగులు లసోట టీకాలు ఇప్పించాలి. ఇవి ఇంటి ఆవరణంలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి నట్టలు ఎక్కువగా ఆశ్రయించడానికి ఆస్కారం ఉంది కాబట్టి నట్టల నివారణకు పైరేజినే అదిపటే అనే మందును త్రాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కె వి కే శాస్త్రవేత్తలు డాక్టర్ రాజు డాక్టర్ గణేష్ మరియు జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం మేనేజింగ్ డైరెక్టర్ బ్రహ్మం,కోఆర్డినేటర్లు సుల్తాన్య మరియు రాజు పాల్గొన్నారు.