Thursday, 5 November 2026

కనుమరైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా బొద్దుల నగేష్ కుమార్ నియామకం

కనుమరైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా బొద్దుల నగేష్ కుమార్ నియామకం

 

రాజాపేట, డిసెంబర్8 ( జనం సాక్షి): కనుమరైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా రాజపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన బొద్దుల నగేష్ కుమార్ నియామకమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గా ఉన్న బొద్దుల నగేష్ కుమార్ గారికి ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకుగాను పదోన్నతి కల్పిస్తూ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ జనరల్ సెక్రెటరీగా నియమించినట్లు నగేష్ కుమార్ తెలిపారు. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామగిరి హరిబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు పండుకున్నారు. ఈ సందర్భంగా బొద్దుల నగేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నియామకం సభ్యులపై మరింత బాధ్యత పెరిగిందని, వినియోగదారునికి నష్టం వాటిల్లకుండా వారికి జరిగే సమస్యలను పరిష్కరించడమే సంస్థ లక్ష్యమని అదే బాటలో అందరం కలిసి వినియోగదారులకి ఉండే హక్కులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దామని తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులు కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ నేషనల్ ప్రెసిడెంట్ నవీన్ శర్మ గారికి స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ అగర్వాల్ కి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామగిరి హరిబాబు కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామగిరి హరిబాబు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,
రమేష్ (రవి యాదవ్),రాష్ట్ర ఉపాధ్యక్షులు,
మాతంగి సుగుణ రాజు , స్టేట్ సెక్రటరీ,మహావీర్ జైన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు,
మస్కా ప్రభు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి,రమణ ఖైరతాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు
క్రిస్టోఫర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
ఆకుల కవిలత పాల్గొన్నారు.