: శామీర్ పేట్ జనంసాక్షి :గత 19 రోజుల నుండి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్కార్యాలయంలో పరిశీలించిన ఈవీఎంలు,వివిప్యాట్ లు కలెక్టరేట్ లోని ఈవీఎం గోదాంలో భద్రపరచారు.శనివారం రోజు కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎం మిషన్ లను మాకపోల్ నిమిత్తం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ లు ఏనుగు నర్సిహ్మారెడ్డి మరియు అభిషేక్ అగస్త్యల ఆధ్వర్యంలో
పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు
శామీర్ పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ గౌడ్,తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి,మల్కాజ్ గిరి మండల్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు శంకర్,బీఎస్పీ మేడ్చల్ అసెంబ్లీ అధ్యక్షులు చీర్యాల జంగయ్య,శామీర్ పేట్ మండల బిజెపి అధ్యక్షులు యాదగిరి,శామీర్ పేట్ మండల బిఆర్ఎస్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్,మరియు తదితరులు సమక్షంలో ఓపెన్ చేశారు.
ఈవిఎం మిషన్ ల మాక్ పోల్ లో పాల్గొన్న నాయకులు




