బెల్లంపల్లి, జులై 1, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా ఏరియాలో శనివారం అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘం ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణం లోని నిత్య హాస్పిటల్ ఆరోగ్య సిబ్బంది వైద్యం కోసం వచ్చిన ఒక నిండు పసికందును తెలిసి తెలియని వైద్యం తో మూడు నెలల బాబు మరణానికి కారణం అయ్యారని అన్నారు. ఇలాంటి సరైన అనుమతులు, సౌకర్యాలు లేని హాస్పిటల్ కి డిఎంహెచ్ఓ ఎలా పర్మిషన్ ఇస్తున్నారని విమర్శించారు.ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో సరైన వసతులు లేని హాస్పిటల్ పెట్టడం నిబంధనలకు విరుద్ధం అని అన్నారు. ఇలాంటి హాస్పిటల్ పై చట్ట రీత్యా చర్యలు తిసుకొని హాస్పిటల్ నీ సీజ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమం లో అఖిలపక్ష యువజన నాయకులు అల్లి సాగర్, సబ్బని ప్రసాద్, శనిగారపు శ్రావణ్, పోచంపల్లి హరీష్, పసుపులేటి వెంకటేష్, ఖమ్మం శ్రీనివాస్, రెడ్డి చరణ్, సరిష్ తదితరులు పాల్గొన్నారు.
డిఎంహెచ్ఓ దిష్టిబొమ్మ దహనం.




