Wednesday, 4 November 2026

ఈస్టర్ పండుగ సందర్భంగా పేద కుటుంబానికి ఆర్థిక సహాయం

 

 

 

 

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 9 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని తిలక్ నగర్ లో నివసించే కుడితొట్టి నాగార్జున కొన్ని రోజుల క్రితం చెట్టుపై నుంచి కిందపడి నడుములు ప్యాక్చరై, అసలే పేద కుటుంబం ఆపరేషన్ కొరకు చాలా పైసలు ఖర్చుపెట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్న నాగార్జున కుటుంబానికి ఆర్థికంగా కొంత సహాయాన్ని అందించాలని ఈస్టర్ పండుగ సందర్భంగా అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు కోల్లపూడి యోహాన్ కుటుంబం తరఫున కొంత నగదును వారికి అందజేశారు. ఈ సందర్భంగా యోహాన్ మాట్లాడుతూ ఇంకా ఎవరైనా దాతలు ఆర్థికంగా ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మకొమ్మ రోజమ్మ, కోల్లపూడి శ్యామ్, కుడితొట్టి ఇర్మియ, కోల్లపూడి జ్యోతి కుమారి, కోలపుడి శ్రీవిద్య, కోలపూడి విక్రమ్, కుడితొట్టి సునంద, కోల్లపూడి మనోజ్ కుమార్ పాల్గొన్నారు.