Wednesday, 4 November 2026

బీఆర్‌ఎస్‌హయాంలోనేతెలంగాణా లో అభివృద్ధి: ఎం ఎల్ ఎ సండ్ర

 

 

 

 

 

 

 

 

 

పెనుబల్లి, ఎప్రిల్ 9(జనం సాక్షి) బి ఆర్ ఎస్ పార్టీ తోనే తెలంగాణాలో అభి వృద్ధి జరిగిందని సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు, అదివారం పెనుబల్లి గ్రామ పంచాయితీ బి సి కాలనీలో సండ్ర మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి బి.ఆర్.యస్ పార్టి ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం పలికారు,ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశాల మేరకు  సండ్ర వెంకటవీరయ్య  అధ్వర్యంలో పెనుబల్లి మండలంలోని 17 గ్రామాలు ఒక యూనిట్ గా మండాలపాడు గ్రామం ఆడవిమల్లెల క్రాస్ రోడ్డు వద్ద  ఈనెల 12 న జరగనున్న ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబ సమేతంగా రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను, ముఖ్యమంత్రి కెసిఆర్  ఆత్మీయ సందేశం, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో ఉన్న కరపత్రాలను అందచేసారు, అనంతరం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కోటగిరి సుధాకర్ బాబు నివాసగృహంలో జరిగిన విలేకర్ల సమావేశంలో  ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య  మాట్లాడుతూ హైదరాబాద్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడి తెలంగాణ పై ఉన్న అక్కస్సు ను వెళ్ళగక్కే విధంగా మాట్లాడిన మాటాలను తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. తెలంగాణ  ఏర్పడిన తరువాత కేంద్రంలో ఉన్న బిజేపి తెలంగాణ అభివృద్ధి కోసం ఎదైనా చేస్తానంటే అడ్డుకున్నది ఎవ్వరో సమాదానం చెప్పాలన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత విభజన చట్టం హామిలు ఒక్కటి కూడా అమలు చెయ్యకుండా విభజన చట్టంలో పెట్టిన నియోజకవర్గాల పునవిభజన ఏ మాత్రం ముందుకు తీసుకు రాలేదన్నారు. బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, ఖాజీపేట రైల్వే కోచ్ విభజన చట్టంలో హామిలు‌ ఉన్నాయి..ఇప్పటి వరకు అవి నిమ్మకు నిరేత్తినట్టుంది. మోడి  35 నిమిషాల ప్రసంగలో 30 సార్లు తెలంగాణ సర్కార్ పేరేత్తి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆస్తిర పరచాటానికి తెలంగాణ సమాజన్ని ఆవహేళన చేసే విధంగా మోడి మాట్లాడారానన్నారు.కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లు తావు నాయక్, భూక్యా పంతులి,ఎం పి టి సి, చీపు లక్ష్మీ కాంత, ఎం పి పి లక్కీనేని అలేఖ్య, జెడ్ పి టి సి చెక్కికాల మోహనరావు,మండల పార్టీ అధ్యక్షుడు కనగాల వెంకటరావు, బొర్రా వెంకటేశ్వర్లు, మల్లెల సతీష్, బజ్జూరి గోపి, తేళ్లూరి నాగేశ్వరావు, గౌస్, పొట్లపల్లి కృష్ణ, కొప్పుల రాంబాబు,పానేంవెంకటేశ్వర్లు,మల్లెల శ్రీనివాసరావు, బండి వెంకటేశ్వర్లు,పొట్లపల్లి నాగప్రసద్, సయ్యద్ జాని, మండల పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.