Wednesday, 4 November 2026

ఈ నెల 10, 11 తేదీల్లో తెలంగాణలో రాహుల్‌ పర్యటన

హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 10, 11 తేదీల్లో రాహుల్‌ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. 10వ తేదీ హైదరాబాద్‌ చేరుకున్నాక.. రోడ్డు మార్గంలో ఆదిలాబాద్‌ నిర్మల్‌కు రాహుల్‌ చేరుకుంటారు. రాత్రికి అక్కడి ఓ గిరిజన తండాలో బస చేయనున్నారు. 11వ తేదీ ఉదయం 15 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో రైతులందరితో వారి సమస్యల గురించి చర్చిస్తారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *