Tuesday, 3 November 2026

ఈ నెల 12 నుంచి రెవెన్యూ సదస్సులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్‌. రఘువీరారెడ్డి ప్రకటించారు. ఏప్రిల్‌ పది వరకు సదస్సులు జరుగుతాయన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ, సీపీఎం నేతలు సారంపల్లి మల్లారెడ్డి, వెంకట్‌, తెరాస నేత ఈటెల రాజేందర్‌, భాజపా నేతలు యెండల లక్ష్మీ నారాయణమల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రఘువీరా మాట్లాడుతూ ఈ నెల 12న రెవెన్యూ సదస్సులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడి, జిల్లాల్లో మంత్రులు ప్రారంభిస్తారని చెప్పారు. గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ భూముల గుర్తింపు, ఆధార్‌, మీ సేవ కార్యక్రమాల్లో ప్రజల్లో వస్తృత  ప్రచారం కల్పించడం కోసం ఈ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ… రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన మండలాల సంఖ్యను పెంచాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తహసీల్దారులను పెంచాలని, అసలైన భూ యజమానులకు హక్కులను బదిలీచేయాలన్నారు. భూవివాదాలు పరిష్కారించాలని, మండలాలను పెంచాలని తెదేపా ఎమ్మెల్యే లింగారెడ్డి కోరారు. ఈ సదస్సుల్లో భూ సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని సీపీఎం నేతలు సారంపల్లి మల్లారెడ్డి, వెంకట్‌లు ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *